బుడిబుడి అడుగులు వేసే బుజ్జాయి.. ఉదయం లేవగానే చకచకా రెడీ అయి స్కూల్ కి వెళ్ళిపోయేవాడు. ఈ ఏడాదే నర్సరీలో జాయిన్ చేయడంతో.. హుషారుగా రోజు బ్యాగును భుజాన వేసుకుని బయలుదేరేవాడు. రోజు మాదిరిగానే గురువారం(సెప్టెంబర్ 19) బడికి వెళ్లాడు.
బుడిబుడి అడుగులు వేసే బుజ్జాయి.. ఉదయం లేవగానే చకచకా రెడీ అయి స్కూల్ కి వెళ్ళిపోయేవాడు. ఈ ఏడాదే నర్సరీలో జాయిన్ చేయడంతో.. హుషారుగా రోజు బ్యాగును భుజాన వేసుకుని బయలుదేరేవాడు. రోజు మాదిరిగానే బుధవారం బడికి వెళ్లాడు. స్కూల్ బస్సులో వెళ్లి బుద్ధిగా పాఠాలు నేర్చుకుని.. తిరుగు ప్రయాణం అయ్యాడు. గమ్యస్థానం వచ్చింది. ఇంటి దగ్గరే దిగాడు. చలాకీగా ఇంటి వైపు వెళ్తున్నాడు. అంతలోనే అప్పటివరకు తనకు సేఫ్‌గా తీసుకొచ్చిన బస్సే, మృతి శకటంగా మారింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి ప్రాణాన్ని ఆ బస్సు చిదిమేసింది. ఆ విషాదకర ఘటన భీమిలిలో చోటు చేసుకుంది.
భీమిలి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నారాయణరాజు పేటకు చెందిన రమణ, ఆదిలక్ష్మి కి ఇద్దరు పిల్లలు. పెద్దకొడుకు వేణు తేజ ఐదేళ్లు. ఈ ఏడాదే బడిలో చేర్పించారు. రోజు బడికి వెళ్తుంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోయేవారు. బడికి వెళ్లిన తర్వాత వచ్చేవరకు కళ్ళకు కాయలు కాసుకునేలా చూసేవారు. రోజు గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పద్మనాభం మండలం రేవిడిలోని ప్రయివేటు స్కూలుకి వెళ్లి వచ్చేవాడు. రోజు మాదిరిగానే..సాయంత్రం 4 గంటలకు పాఠశాల బస్సులో స్వగ్రామానికి చేరుకున్నాడు ఆ బాలుడు. మరికొందరు పిల్లలతో కలిసి సరదాగా బస్సు దిగాడు. ఎవరికి వారు వెళ్లిపోయారు.
అయితే పిల్లలు దిగిన తర్వాత బస్సును టర్న్ చేశాడు డ్రైవర్. అక్కడే ఉన్న వేణు తేజ ను డ్రైవర్ గమనించకపోవడంతో ఢీకొంది ఆ బస్సు. బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు బాలుడు. ఘటన కళ్ళ ముందు చూసిన వారంతా భీతిల్లిపోయారు. క్షణాల్లోనే చిన్నారిని బస్సు చదివేయడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరై విలపించింది. డ్రైవర్ నిర్లక్ష్యమే బాలుడి ప్రాణం చేసిందని బోరున విలపించారు. ఈ ఏడాదే పాఠశాలలో చేరిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.
Also read
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం