వేములవాడలో జ్యోతిషం చెప్పే ఓ పూజారి అధిక వడ్డీల పేరుతో రెండు కోట్లు వసూలు చేసి ఊడాయించాడు. తన దగ్గరికి వచ్చే అమాయక ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టించి నమ్మించి మోసం చేసాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జ్యోతిషం చెప్పే మహేష్ రెండు కోట్ల రూపాయలతో పరారయ్యారు. గత కొంతకాలం వేములవాడలోని అంభాబాయ్ అలయంలో పూజారిగా పనిచేసేవాడు. అలయంలో పూజలతో పాటుగా, జ్యోతిష్యం, వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకి దగ్గర అయ్యాడు. తాను చెప్పినట్లు పూజలు చేస్తే కోరుకున్నది సాధించవచ్చని నమ్మకం కలిగించాడు. మహేష్ వద్దకి వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో వారికి అధిక వడ్డీ ఆశ చూపించాడు.
తాను చెప్పినట్లు డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని కొంత మందికి అధిక వడ్డీ ఇస్తూ నమ్మిస్తు వచ్చాడు. అధిక వడ్డీ ఇస్తూ ఉండడంతో చాలా మంది మహేష్‌ను నమ్మి డబ్బులు అప్పజెప్పారు. డిపాజిట్ కాలం ముగిసిన వారికి డబ్బులు చెల్లించి మళ్ళీ డిపాజిట్ల ఆశ చూపడంతో నగరంలోని చాలమంది రెండు కోట్ల వరకు డిపాజిట్ చేసారు. రెండు కోట్లు వసూలు అయ్యాక వాటిని సర్దుకొని మహేష్ ఉడాయించాడు. కొద్ది రోజులుగా జోతిష్యాలయం మూసి ఉండడంతో పాటుగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వేములవాడలోని వ్యాపారులు, భక్తులు మహేష్ పూజారి వద్ద పెట్టుబడులు పెట్టిన వారు పోలీసులని కలిసి తమ డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





