పోలీసులకు గంజాయి రవాణా అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటకుండా కఠిన చర్యలు చేపడుతున్నారు. కానీ కొందరు కేటుగాళ్లు ఇటీవల క్రియేటివిటీని ఉపయోగించి గంజాయిని రాష్ట్రాల సరిహద్దులు దాటిద్దామని అనుకున్నారు. పోలీసులు ఏమైనా తక్కువ.. కాపుకాసి రెడ్ హ్యాండెడ్‌గా స్మగ్లర్లను పట్టుకున్నారు.. ఆ స్టోరీ ఏంటంటే..
విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా.. పక్కా సమాచారంతో 117 కిలోల గంజాయిని, బొలేరో వాహనంలో అక్రమ రవాణకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్.కోట పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 19న బొడ్డవర చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, ఒడిస్సా రాష్ట్రం నుంచి ఇద్దరు వ్యక్తులు కేఎల్ 48జె 5309 బొలేరో వాహనంలో గంజాయిని కేరళ రాష్ట్రంకు తరలిస్తూ పట్టుబడారు.
పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారణ చేయగా కేరళ రాష్ట్రంకు చెందిన రామ్ అనే వ్యక్తి ఆదేశాలతో ముందుగా అరకు వచ్చి, అక్కడ వేరే వ్యక్తుల సహకారంతో ఒడిస్సా రాష్ట్రంకు వెళ్ళి, 117 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, ఎవ్వరికీ అనుమానం రాకుండా వాహనం వెనుక భాగంను ఒక అరగా మార్పు చేసి, దానిలో గంజాయిని డంప్ చేసి, కేరళ రాష్ట్రంకు తరలించాలనున్నారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు.
గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు చెక్ పోస్టులు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్న కారణంగా ఇటీవల గంజాయి పట్టుకోగలుగుతున్నామని, చెక్ పోస్టుల్లో సిబ్బంది పనితీరు బాగుందన్నారు విజయనగరం డీఎస్పీ. గంజాయి పట్టుకోవడంలో సమర్ధవంతంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు
Also Read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!