February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

కత్తులతో మరదలపై వదిన దాడి

• కలకలం రేపిన కుటుంబకలహాలు

• బాధితురాలి పరిస్థితి విషమం

ముధోల్: కుటుంబ కలహాలతో బుధవారం మరదలుపై వదిన కత్తితో దాడి చేసిన ఘటన మండలంలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిమాధవ్నగర్లో భైంసా మండలం బోరిగాం గ్రామానికి చెందిన హన్మంర్రావు అద్దెకు ఉంటున్నాడు.  హన్మంత్ రావు ముధోల్  ఎస్బీఐలో ఉద్యోగం చేస్తున్నాడు


రెండు నెలల క్రితం హన్మంతరావు భార్య అశ్విని ప్రసవానికి వెళ్లి భైంసా పట్టణంలోని తల్లి వద్ద ఉంటుండగా, హన్మంత్రావ్తో పాటు అతని సోదరి రీచా (తనుజ) ఉంటున్నారు. కాగా బుధవారం అశ్విని బుర్కా వేషంలో వచ్చి భర్త హన్మంత్రావు ఇంట్లో లేని సమయంలో తనుజపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. తనుజ కేకలు వేయగా అరుపులు విన్న చుట్టుపక్కల వారు అశ్వినిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మల్లేశ్ అక్కడకు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

గాయాలపాలైన తనుజను 108 అంబులెన్సులో భైంసా ఏరియాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడిన అశ్వినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ మాట్లాడుతూ కుటుంబ కలహాలతోనే అశ్విని తనుజపై కత్తితో దాడి చేసిందన్నారు. తనుజ గొంతు, చేతి మణికట్టు వద్ద కత్తిగాట్లు ఉండటం వల్ల మాట్లాడేస్థితిలో లేదని తెలిపారు. తనుజ కోలుకున్న తర్వాత తన వాంగ్మూలం సేకరించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ మల్లేశ్ పేర్కొన్నారు.

Also read

Related posts

Share via