SGSTV NEWS online
Andhra PradeshCrime

అమ్మవారి మంగళసూత్రం.. అర్చకుని ఇంట్లో ప్రత్యక్షం



పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం ఇటీవల మాయమైంది. శాశ్వత అర్చకులకు అసిస్టెంట్ అయిన, పెదకాకాని పాతూరుకు చెందిన కొండవీటి రణధీరన్ను ఈ కేసులో పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. అర్చకుల ఇళ్లలో సోదాలు చేయగా, రణధీర్ ఇంట్లో వస్తువును గుర్తించారు.

పోలీసులు ప్రశ్నించగా చోరీ చేసినట్లు అంగీకరించారు. ఈ క్రమంలోనే నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ నారాయణస్వామి విలేకర్లకు తెలిపారు.


శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆగస్టు 14న అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల దర్శనార్థం రెండు రోజులపాటు ఈ అలంకరణనే కొనసాగించారు. అమ్మవారి మంగళసూత్రం మాయమైనట్లు అర్చకులు 18న గుర్తించారు. ఈ మేరకు ఆలయ ఈవో గోగినేని లీలాకుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.

Also Read

Related posts