3వేల 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో సింథటిక్ కెమికల్స్ వేసి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అక్రమంగా తయారు చేస్తోంది ముఠా.

Adulterated Ginger Garlic Paste : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతి ఆహార వస్తువును కల్తీ చేస్తున్నారు. నాసిరకమైన, హానికరమైన పదార్ధాలతో తినే వస్తువులు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. నకిలీ వస్తువులను మార్కెట్ లో విచ్చలవిడిగా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలేవీ తెలియని ప్రజలు వాటిని కొని తిని జబ్బుల బారిన పడుతున్నారు. తాజాగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వ్యవహారం బయటపడింది.
కొందరు కేటుగాళ్లు కుళ్లిన పదార్ధాలు, హానికారక రంగులు వినియోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. సైబరాబాద్ SOT రాజేంద్రనగర్ టీమ్ జరిపిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో నకిలీ అల్లం పేస్ట్ తయారీ గోడౌన్ లో ఎస్వోటీ పోలీసులు సోదాలు జరిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ నే ప్రజలు అధికంగా వాడుతున్నారు. నగరాల్లో చెప్పక్కర్లేదు. వీటికి ఫుల్ డిమాండ్ ఉంది. దీన్ని కొందరు నీచులు క్యాష్ చేసుకుంటున్నారు. నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సైబరాబాద్ SOT రాజేంద్రనగర్ టీమ్ కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో నకిలీ అల్లం తయారీ గోడౌన్స్ లో సోదాలు నిర్వహించారు. 3వేల 500 కిలోల (3.5 టన్నుల) నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో సింథటిక్ కెమికల్స్ వేసి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అక్రమంగా తయారు చేస్తోంది ముఠా. ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్, గమ్ పౌడర్, సోడియం బెంజోయేట్ (నెఫ్రోటాక్సిక్ పదార్థం) మృదుత్వం కోసం కెమికల్ పౌడర్, చెడిపోయిన వెల్లుల్లి తొక్కలు వినియోగిస్తున్నారు.
కుళ్లిన పదార్ధాలతో, హానికారక కెమికల్స్ తో తయారు చేసిన నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పలు బ్రాండ్‌ల పేరుతో స్థానిక మార్కెట్‌లకు సరఫరా చేస్తోంది ముఠా. రోషన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మాస్ డైమండ్, ప్యూర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేరుతో నకిలీ ఉత్పత్తులను మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న అల్లం వెల్లులి పేస్ట్..
* ఒక టన్ను వదులుగా కల్తీ వెల్లుల్లి పేస్ట్ (44 టబ్‌లు ఒక్కొక్కటి 25 కిలోలు)
* 2 టన్నుల ప్యాక్ చేసిన వెల్లుల్లి పేస్ట్ (70 కాటన్లు ఒక్కొక్కటి 30 కిలోలు, ప్లాస్టిక్ బాక్సులు..
* సంచుల్లో 500 కేజీల ముడి వెల్లుల్లి మెటీరియల్
* గ్రైండింగ్ మెషీన్లు స్వాధీనం..
నకిలీ ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పొరపాటున వాటిని తింటే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందన్నారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025