ఆదోని : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన దాన్ని వాడుతున్న కొందరు అజ్ఞానముతోనే ఉన్నారని ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాలనీలోకి రాకుండా అడ్డుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని పట్టణంలోని శంకర్ నగర్ కాలనీకి చెందిన రాఘవేంద్ర (35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు సొంత ఊరైన ఆదోనిలో నిర్వహించాలని బంధువులు గత రాత్రి ఆదోనిలోనే శంకర్ నగర్ కు చేరుకున్నారు. ఎక్కడో చనిపోయి పోస్టుమార్టం పూర్తయిన మృతదేహాన్ని అనుమతి ఇచ్చేది లేదని వాహనాన్ని కాలనీవాసులు అడ్డుకున్నన్నారు. మృతుడు రాఘవేంద్ర 15 సంవత్సరాల క్రితం ఆదోని నుండి బతుకుతెరువు కోసం తాడిపత్రిలో జీవనం సాగిస్తున్నారు. మృతుడు రాఘవేంద్ర అనంతపురంలోని ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తాడిపత్రి నుండి అనంతపురంకు వెళ్తుండగా శనివారం రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. అక్కడ పోస్టుమార్టం పూర్తి చేసుకొని సొంత ఊరు అయినా ఆదోనికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. శంకర్ నగర్ కాలనీలో పోస్టుమార్టం చేసిన మృతదేహాన్ని తీసుకురాకూడదని కాలనీవాసులు అడ్డుపడడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. సొంత ఇంటికి మృతదేహాన్ని అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని మృతుడి బంధువులు ఆగ్రహించారు. ఎంత బ్రతిమాలాడిన కనికరం చూపలేదని దుమ్మెత్తి పోశారు. చివరకు చేసేదేమీ లేక మండగిరిలోనే బంధువులు ఇంటికి తరలించి అక్కడి నుండి స్మశాన వాటికలో ఖననం చేశామని తెలిపారు. మృతిదేహాన్ని అడ్డుకున్న వారిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని బంధువులు తెలిపారు.
Also read
- Atmakur Forest Scam: ఆత్మకూరు ఫారెస్ట్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. కోట్లకు కోట్లే గుటకాయ స్వాహా!
- Gandikota Inter Girl: ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!
- సగం ధరకే బంగారం అంటూ ప్రచారం.. ఎగబడి పెట్టుబడి పెట్టిన ప్రజలు.. కట్‌చేస్తే..
- Telangana: వారాంతపు సంతలో నాన్నతో వెళ్లి పల్లీలు కొనుకున్న బాలుడు – రాత్రి తింటుండగా
- మరో దారుణం.. తండ్రితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసిన భార్యామణి!