అమరావతి: విశాఖపట్నంలోని ఎన్‌ఎడి జంక్షన్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులని పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో పోలీసులకు యువకుడికి మద్య మాటామాటా పెరింగింది. దీంతో ఆ పోలీసు చొక్కాను యువకుడు పట్టుకున్నాడు. తన కాలర్ పట్టుకోవడంతో ఆగ్రహించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ యువకుడిని కొట్టాడు. దీనితో రెచ్చిపోయిన యువకుడు తిరిగి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కొట్టాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు. కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నందుకు యువకుడిపై కేసు నమోదు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025