తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది యువతిపై బ్లేడుతో ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి గాయపడింది. యువకుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన కావ్య ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో మూడేళ్లగా నర్సుగా విధులు నిర్వహిస్తోంది. హాస్టల్‌లో ఉంటూ నర్సుగా పనిచేస్తోంది. ఆదివారం సెలవు కావడంతో చర్చికి వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో యువతితో మాట్లాడేందుకు విజయవాడ నున్నకు చెందిన క్రాంతి యత్నించాడు. తాను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో క్రాంతి తన వద్ద ఉన్న బ్లేడుతో యువతి మెడపై దాడి చేశాడు. భయంతో క్రాంతిని నెట్టే క్రమంలో కావ్య చేతిపైన గాయాలయ్యాయి. యువకుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్రాంతిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025