ఉప్పల్ : తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి ఒకరు మృతి చెందారు. జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదివే పాల్వాయి ఆర్యన్ రెడ్డి (23) ఈ నెల 13న మృతి చెందగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుబుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్లోని ధర్మపురికాలనీలో నివసించే పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీతా దంపతుల ఏకైక కుమారుడు ఆర్యన్ రెడ్డి గత ఏడాది డిసెంబరులో ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. ఈ నెల 13న స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. అదే రోజు ఆర్యన్ ఉండే గది నుంచి తుపాకీ శబ్దం వచ్చింది. స్నేహితులు వెళ్లి చూసేసరికే అతడి ప్రాణం పోయింది. తూటా ఛాతీ లోపలికి దూసుకుపోవడంతో అక్కడికక్కడే ఆర్యన్ మృతి చెందారు. తుపాకీని శుభ్రం చేసే సమయంలో ప్రమాదవశాత్తు (మిస్ఫైర్) పేలి ఆర్యన్ మృతి చెంది ఉంటాడని ఆయన తండ్రి సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
విద్యార్థులకు కూడా గన్ లైసెన్సులు ఇస్తారని ఇప్పుడే తెలిసింది: తండ్రి దేశసేవ అంటే ఆర్యన్ చాలా ఆసక్తి చూపేవాడని తండ్రి సుదర్శన్రెడ్డి తెలిపారు. ఆర్మీలో చేరతానంటే తామే వద్దని వారించామన్నారు. అమెరికాలో ఉన్న గన్ కల్చరే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ విద్యార్థులకు కూడా గన్ లైసెన్సులు ఇస్తారనే విషయం ఇప్పుడే తెలిసిందన్నారు. ఆర్యన్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టులోనే హంటింగ్ గన్ కు లైసెన్సు తీసుకున్నారు. ఇందుకోసం ఓ పరీక్ష కూడా రాశారు.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!