పరీక్ష రాసేందుకు వెళ్లిన తల్లి తిరిగి ఇంటికి రావడం చూసిన చిన్నారి అయ్.. అమ్మొచ్చిందంటూ సంబరపడింది. ఆమెను హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది.
ఖమ్మం : పరీక్ష రాసేందుకు వెళ్లిన తల్లి తిరిగి ఇంటికి రావడం చూసిన చిన్నారి అయ్.. అమ్మొచ్చిందంటూ సంబరపడింది. ఆమెను హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. కానీ అమ్మను చేరక ముందే ఆ పాప ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, స్థానికుల కథనం మేరకు.. ఎంవీపాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్, లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక(4). సోమవారం లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. మధ్యాహ్నం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా పరుగెత్తుతూ కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది.
వెంటనే స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు చెప్పారు. ఎప్పుడూ చలాకీగా ఉండే కుమార్తె ఉన్నట్లుండి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





