కడప: తెలిసీ తెలియని వయసు వారిది.. చూడగానే ఒకరినొకరిపై ఆకర్షణ కలిగింది.. మెల్లగా మాట కలిసింది.. ఆపై ప్రేమ చిగురించింది.. ఊహల్లో విహరించారు.. ఊసులెన్నో చెప్పుకున్నారు.. కలిసి జీవించాలని కలలుగన్నారు.. ఏమైందో.. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థ తలెత్తింది.. మాటల్లో తేడా వచ్చింది.. తెలియని సంఘర్షణ ఏదో ఆ లేత మనసును గాయపరిచింది. అంతే .. కలిసి జీవించాలనుకున్న వారే విడివిడిగా బలవన్మరణానికి ఒడిగట్టారు.. కన్నోళ్లకు కడుపుకోత మిగిల్చారు.. ప్రేమ జంట యోగీంద్రకుమార్, హేమశ్రీ విషాదగాథ ఇది.
జీవితమంతా కలిసుందామనుకున్నఆ ఇద్దరిని వారి తల్లిదండ్రులు కలిసి అంతిమసంస్కారాలు నిర్వహించారు. మంగళవారం చెన్నూరు గ్రామశివార్లలో పక్కపక్కనే సమాధి చేశారు. కాగా, అంత బాధలోనూ రిమ్స్ సమీపంలోని డాక్టర్ ఎల్.వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సిఫారసు మేరకు యువకుడి తల్లిదండ్రులు కొడుకు నేత్రదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
Also read
- Garuda Purana: దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు ఇవే!
- Achamanam: పూజకు ముందు ఆచమనం ఎందుకు చేస్తారు? శాస్త్రాలు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే
- నేటి జాతకములు 5 ఆగస్టు, 2026
- ‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
- కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా





