మహబూబాబాద్: తొర్రూర్ పట్టణ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు కుమారులకు ఉరివేసి హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు కథనం ప్రకారం.. తండ్రి వలి తన ఇద్దరు కుమారులు విలాస్ (5), వికేష్ (3)లను పోలంలోకి తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అదే చోట తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





