April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

అనంతపురం :జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు

అనంతపురం :జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు

* తదుపరి చర్యలలో భాగంగా … ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసుల చర్యలు

* పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చట్ట పరమైన చర్యలు తీసుకోనున్న పోలీసులు

* మృతురాలి కుటుంబ సభ్యులను ఐసిడిఎస్ అధికారులతో కలిసి విచారించిన ఒన్ టౌన్ సి.ఐ రెడ్డెప్ప…మృతురాలి ముగ్గురు పిల్లలను ఐసిడిఎస్ కు అప్పగింత…

* ఈనెల 23 వ తేదీన అంజలిని బేల్దారి పనుల కోసం ఉదయం 9 గంటలకు ఆటోలో తీసికెళ్లిన బాలు అనే బేల్దారి

* తిరిగి అదేరోజు రాత్రి 8 గంటలకు కొందరు అంజలిని స్థానిక షికారి కాలనీలో ఉన్న ఇంటి వద్ద వదలి వెళ్లినట్లు చెబుతున్న ఆమె కుటుంబ సభ్యులు

* ఆ తర్వాత… అదే రోజు రాత్రి 11:30 గంటల సమయంలో అంజలి, ఆమె భర్త రాజు తీవ్రంగా గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి

* ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఆమె చనిపోయిందని… అదే రోజు సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలులో భాగంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు సి.ఐ కు వివరించారు… అన్ని కోణాల్లో విచారించి చట్టపరంగా చర్యలు చేపట్టనున్నామని సి.ఐ తెలిపారు

Also read

Related posts

Share via