April 8, 2025
SGSTV NEWS
CrimeTelangana

కేబీఆర్‌ పార్కులో యువతిని వెంబడించిన ఆగంతకుడు

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వాక్‌ వేలో ఓ మహిళను వెంబడించిన యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌– 1లో నివసించే యువతి (33) ఆదివారం సాయంత్రం కేబీఆర్‌ పార్కు లోపల తన తల్లితో కలిసి వాకింగ్‌ కోసం వచ్చారు. పార్కు లోపల వాకింగ్‌ చేస్తుండగా ఆమెను అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు వెంబడించాడు.

అనుమానించిన యువతి నెమ్మదిగా తన సెల్‌ ఫోన్లో వీడియో తీసింది. అదే సమయంలో షీ టీమ్స్‌కు చెందిన ఒకరు వాకింగ్‌కు వచ్చి ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే షీ టీంకు సమాచారం అందించారు. యువతి పార్కు వద్ద ఉన్న సెక్యూరిటీకి సమాచారం ఇవ్వడంతో ఆగంతకుడిని పట్టుకున్నారు. అతన్ని విచారించగా కోల్‌కతాకు చెందిన అబ్దుల్‌ రహమాన్‌ (28)గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌– 14లోని వస్త్ర దుకాణంలో పని చేస్తున్నట్లు విచారణలో తేలింది. అదే సమయంలో పార్క్‌ వద్దకు షీ టీం, బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via