తెదేపా గెలిచిందన్న సంతోషంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తపై.. వైకాపా మూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. పసుపుజెండా పట్టుకోవడమే పాపమన్నట్లు కర్రలు, క్రికెట్ బ్యాట్తో తీవ్రంగా కొట్టాయి.
తుమ్మపూడి(దుగ్గిరాల), : తెదేపా గెలిచిందన్న సంతోషంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తపై.. వైకాపా మూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. పసుపుజెండా పట్టుకోవడమే పాపమన్నట్లు కర్రలు, క్రికెట్ బ్యాట్తో తీవ్రంగా కొట్టాయి. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 4న వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో తెదేపా విజయం సాధించడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పార్టీ కార్యకర్త షేక్ ఖాశిం(24) సంబరాలు చేసుకున్నారు. తన స్నేహితుడి ద్విచక్రవాహనానికి తెదేపా జెండా కట్టి ఇద్దరూ రేవేంద్రపాడు బయలుదేరారు.
ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా కార్యకర్తలు తుమ్మపూడి వద్ద వీరి వాహనాన్ని ఆపారు. కర్రలతో ఇద్దరిపై దాడి చేశారు. క్రికెట్ బ్యాట్తో ఖాశిం తల వెనుక కొట్టడంతో కిందపడిపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు బాధితులను చూసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఖాశిం కోమాలోకి వెళ్లడంతో వెంటిలేటర్ పై ఉంచారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు.
దాడికి పాల్పడిన బోడపాటి కమలాకరరావు, హృదయరాజు, హర్షవర్ధన్, పల్లం రవీంద్రబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వెంకట్రావ్ తెలిపారు.
Also read
- మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
- బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
- హనుమంతుడి ఆశీస్సుల కోసం హనుమంతుడి జయంతి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..
- Lucky Zodiac Signs: చంద్ర మంగళ యోగం.. ఆ రాశుల వారికి అధికారం, ఆదాయం పక్కా..!
- నేటి జాతకములు..8 ఏప్రిల్, 2025