April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఏటీఎం ధ్వంసం.. రూ.24.92 లక్షలు చోరీ



తొమ్మిది నిమిషాల వ్యవధిలో ముగ్గురు దొంగలు గ్యాస్ కట్టర్ ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.24,92,600ల నగదు చోరీ చేసి పరారైన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలకేంద్రంలోని వన్నెల్(బి) కూడలి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.

బాల్కొండ, : తొమ్మిది నిమిషాల వ్యవధిలో ముగ్గురు దొంగలు గ్యాస్ కట్టర్ తో ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.24,92,600ల నగదు చోరీ చేసి పరారైన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలకేంద్రంలోని వన్నెల్(బి) కూడలి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దొంగలు చోరీకి పాల్పడడానికి ముందుగా తెల్లవారు జామున 2.02 గంటలకు కారులో ఏటీఎం వద్దకు వచ్చారు. ఏటీఎం గదిలోకి ప్రవేశించి సీసీ కెమెరాలపై తెల్లటి రంగును స్ప్రే చేసి వెళ్లిపోయారు. మళ్లీ 2.23 గంటలకు కారులో వచ్చి ముగ్గురు దిగి ఏటీఎం గదిలోకి ప్రవేశించారు. వెంట తీసుకొచ్చిన గ్యాస్ కట్టర్ ఏటీఎంను ధ్వసం చేశారు. అందులోని రూ.24,92,600లను దోచుకొని 2.32 గంటలకు పారిపోయారు. అయితే ఏటీఎంను ధ్వంసం చేసిన సమయంలో సెక్యూరిటీ అలారమ్ ముంబయిలోని ఎస్బీఐ కార్యాలయ కంట్రోల్ రూంనకు వెళ్లింది. వారు  బాల్కొండ పోచంపాడ్ ఏటీఎం సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పోలీసులను సంప్రదించారు. పోలీసులు పోచంపాడ్లో ఏటీఎంలో తనిఖీ చేసి వన్నెల్(బీ) కూడలిలోని ఏటీఎంకి వచ్చే లోపు దొంగలు చోరీ చేసి పరారయ్యారు. నిజామాబాద్ నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి వేలిముద్రలు సేకరించారు. దొంగల ఆచూకీకి ప్రయత్నించారు. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్రావు, ఆర్మూర్ గ్రామీణ సీఐ శ్రీధర్రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి చోరీ జరిగిన తీరును ఆరా తీశారు. ఏటీఎం ఛానల్ మేనేజర్ అవధూత నితిన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శంకర్ తెలిపారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా గాలిస్తున్నారు. ఏటీఎంలో సోమవారం సాయంత్రం నగదు పెట్టారని తెలిసింది. చోరీకి పాల్పడే ప్రయత్నంలో దొంగలు ఇది గమనించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం నుంచి ఉండడంతో పోలీసులు బందోబస్తులో ఉంటారని.. ఇదే అదనుగా భావించి చోరీకి పాల్పడ్డారని తెలుస్తోంది.

Also read


Related posts

Share via