అమరావతి : సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులకు సవాలు విసురుతూ శాంతిభద్రతలకు పలువురు విఘాతం సృష్టిస్తున్నారని, అలాంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కొంతమంది వ్యక్తిగత ధూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పోస్టుల పట్ల గ్రూప్ అడ్మిన్‌లు కూడా అప్రమత్తంగా వుండాలని సూచించారు. అలాంటి పోస్టులను వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టుకోవడం, మరొకరికి షేర్ చేయడం నిషిద్ధమని తెలిపారు. రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులపై పోలీస్‌శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





