కాకినాడ జిల్లా అన్నవరం శివారు ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. తుని మండలం తేటగుంట వద్ద జాతీయ రహదారిపై హైడ్రోక్లోరిక్ ఆమ్లం తరలిస్తున్న ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం వెళ్తున్న హైడ్రోక్లోరిక్ ట్యాంకర్‌ను వెనక నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఇటు అన్నవరం వైపు అటు తుని వైపు ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు
ప్రమాదానికి గురైన హైడ్రో క్లోరిక్ ఆమ్లం ట్యాంకర్ నుంచి దట్టమైన పొగతో పాటు తెల్లటి లావణంతో కూడుకున్న యాసిడ్ లీక్ అవడంతో ఘటనాస్థలంలో దట్టమైన పొగలా ఉండడంతో పాటు తీవ్ర దుర్వాసన కూడా వెలువడింది. దీంతో స్థానిక వాహనదారులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కళ్ల మంటలు వస్తుండడంతో స్థానికులు ఆస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా తేటగుంట దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చేందుకు సర్వశక్తుల ప్రయత్నించారు. ట్రాఫిక్ ని మళ్ళించి వాహనాలను పునరుద్దరించారు. అయితే దుర్వాసన గ్యాస్ వెలబడకుండా అగ్నిమాపక వాహనాలు రప్పించి గ్యాస్‌ను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





