భాగ్యనగరంలో మహాద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయంలో మహిమాన్వితమైన వింత సంఘటన భక్తులకు దర్శనమిస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలను తాగుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మియాపూర్లోని మదీనాగూడ పోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భాగ్యనగరంలో మహాద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయంలో మహిమాన్వితమైన వింత సంఘటన భక్తులకు దర్శనమిస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలను తాగుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మియాపూర్లోని మదీనాగూడ పోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆలయం మొత్తం పోచమ్మతల్లి నామస్మరణతో మార్మోగిపోయింది. దేవాలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. చెంచాలతో పాలు తీసుకుని అమ్మవారి నోటి వద్ద ఉంచితే వాటిని తాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభుగా వెలసినట్లు చెబుతున్నారు ఆలయ పూజారి నవీన్. ఈ వింతైన ఘటన గురించి గత మూడు రోజుల క్రితం కమిటీకి తెలుపగా వారు కూడా అమ్మవారికి పాలను నైవేధ్యంగా సమర్పించినట్లు తెలిపారు. శుక్రవారం అమ్మవారికి చాలా పవిత్రమైన, ప్రత్యేకమైన రోజుగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకోవడంతో అమ్మవారిపట్ల మరింత భక్తిభావంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి అరుదైన ఘటనలు ఇటీవలి కాలంలో చాలా చోట్ల చోటు చేసుకున్నాయి.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





