జలపాతానికి వరద ఉధృతి కొనసాగుతుండగా, స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జలపాతం సందర్శనలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. అగ్నిమాపక, రక్షణ విభాగానికి చెందిన ఓ బృందం వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
పశ్చిమ కనుమల్లో అకస్మాత్తుగా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో తమిళనాడులోని టెంకాసిలోని పాత కొర్టాలమ్ జలపాతానికి వరదలు పోటెత్తింది. ఒక్కసారిగా వరద ముంచుకురావడాన్ని గమనించిన సందర్శకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వరద ఉధృతికి బంధువులతో కలిసి స్నానానికి వెళ్లిన 17 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.
బాలుడిని అశ్విన్‌గా గుర్తించారు. అతను పాలయంకోట్టైలోని ఎన్జీవో కాలనీలో 11వ తరగతి చదువుతున్నాడు. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ బృందం జిల్లా కలెక్టర్ ఎకె కమల్ కిషోర్, పోలీసు సూపరింటెండెంట్ టిపి సురేష్ కుమార్‌తో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌కు దిగారు.
జలపాతానికి వరద ఉధృతి కొనసాగుతుండగా, స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జలపాతం సందర్శనలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. తమిళనాడు అగ్నిమాపక, రక్షణ విభాగానికి చెందిన ఓ బృందం వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. వాటర్ ఫాల్‌కు వరద పోటెత్తిన దృశ్యాలను కింది వీడియోలో సోషల్ మీడియాలో అప్పుడే వైరల్ అవుతున్నాయి.
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్‌కు వెళ్లిన భర్త.. సైలెంట్‌గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





