SGSTV NEWS online
Assembly-Elections 2024

పోలింగ్ కేంద్రాల్లో వైకాపా రంగులా?



తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రంగులు పోలిన షామియానాలు వేయడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.




తిరుపతి: తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రంగులు పోలిన షామియానాలు వేయడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని ఎస్వీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రంలోని 254, 255, 256, 258 బూత్ల వద్ద వైకాపా రంగును పోలిన షామియానాలు, బెలూన్లు, పరదాలు ఏర్పాటు చేశారని అన్నారు. అవి ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని, వెంటనే తొలగించాలని ఆర్వో అదితిసింగ్ను.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్, జనసేన నేత ఆనంద్ తదితరులు కోరారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

Also read

Related posts