జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది.

చింతకొమ్మదిన్నె,: జే బ్రాండ్ మద్యం తాగి వృద్ధుడు మృతిచెందిన ఘటన వైఎస్సాఆర్ జిల్లాలోని మూలవంకలో మంగళవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని శెట్టిపల్లెకి చెందిన కొండయ్య(65) కొన్నేళ్ల కిందట భార్య మల్లేశ్వరి, కుమారుడితో కలిసి కడప నగరంలోని నాగరాజుపేటకు వలస వచ్చారు. కొండయ్య మద్యానికి బానిసై 3 నెలల కిందట ఇంటినుంచి వెళ్లిపోయి.. పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు.
సోమవారం రాత్రి మూలవంకకు వచ్చి ఓ దర్గా వద్ద పడుకున్నారు. అప్పటికే అతను మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం పరిశీలించగా.. మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి ‘జే బ్రాండ్ మద్యం తాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నకిలీ మద్యానికి బానిసై తన భర్త ప్రాణాలు పోగొట్టుకున్నారని మృతుని భార్య మల్లేశ్వరి విలపించారు. ఈ విషయమై గ్రామీణ సీఐ శంకరానాయక్ను వివరణకోరగా.. దీనిపై తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





