తన కుమారై పై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు విషయం బయటపడటంతో నిర్దోషిగా విడుదలయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ మహిళకు కోర్టు జైలు శిక్షతో పాటు రూ.5.88 లక్షల జరిమానా విధించింది. యూపీకి చెందిన మహిళ తన కూతురి పై ఓ యువకుడు అత్యాచారం చేశాడని 2019లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని ఆమె కూతురు కూడా వాంగ్మూలం ఇచ్చింది. కేసు పెండింగ్లో ఉండగా, నిందితుడు 4ఏళ్లు జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా విచారణలో భాగంగా తాజాగా ఆ బాలిక తన వాంగ్మూలం తప్పని కోర్టులో అంగీకరించింది. దీంతో అదనపు సెషన్స్ న్యాయస్థానం అజయ్్న నిర్దోషిగా ప్రకటించింది. తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లికి 340 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





