వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం తిరుపతి సిటీ వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణ పల్లెలో జరిగింది. ఓ మహిళతో ఉన్న సాన్నిహిత్యం వల్ల విజయ్ అనే యువకుడికి, మైనర్ బాలుడికి మధ్య రగడ జరిగింది. విజయ్ తల్లి మైనర్ బాలుడిని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన విజయ్ తో బాలుడికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో విజయ్ పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేశాడు. వెంటనే విజయ్ ను రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..