విశాఖపట్నం ఎంపీ, తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ఫ్లయింగ్ బృందాలు శుక్రవారం రాత్రి దాడి చేశాయి.
కొనసాగుతున్న సోదాలు
పెదవాల్తేర్ (విశాఖపట్నం), మే 3: విశాఖపట్నం ఎంపీ, తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ఫ్లయింగ్ బృందాలు శుక్రవారం రాత్రి దాడి చేశాయి.
రాత్రి 7.40 గంటలకు ఒక బృందం లాసన్స్ బే కాలనీలోని ఎంవీవీ ఇంటికి వచ్చింది. మరో బృందం ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీ ఎంవీవీ వద్దకు వెళ్లి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి తీసుకొని వచ్చింది.
ఆ తరువాత 9.40 గంటలకు ఇంకో బృందం అక్కడికి చేరుకుంది. మొత్తం మూడు బృందాలు, పోలీసులతో కలసి సుమారు 25 మంది సోదాలు చేస్తున్నారు.
ఎంవీవీ ఇంట్లోకి బయటవారిని ఎవరినీ అనుమతించకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సోదాలు చేస్తున్న సమయంలో ఎంవీవీ సన్నిహితుడు, వైసీపీ నేత జీవీ కూడా ఉన్నట్టు చెబుతున్నారు.
ఎంవీవీ భవనం నాలుగు అంతస్థుల్లో ఉంది. ఇందులో రెండు అంతస్థుల్లో ప్లాస్లిక్ కవర్లు స్వాధీనం చేసుకున్న బృందాలు, అక్కడ ఉన్న వ్యక్తులను ప్రశ్నించినట్టు తెలిసింది.
అర్థరాత్రి దాటిన తరువాత కూడా సోదాలు కొనసాగుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





