కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియో కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను కూడా ప్రధాన నిందితుడిగా చేర్చారు. అయితే తాజాగా మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడిన కేఆర్ నగర్ బాధితురాలి అదృశ్యం కేసులో భవానీ రేవణ్ణ బంధువును అధికారులు అరెస్టు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఇదే తొలి అరెస్ట్
అదృశ్యమైన బాధితురాలి కుమారుడు మే 3వ తేదీన కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హెచ్‌డీ రేవణ్ణపై సెక్షన్ 364/ఏ 365, 34 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు A1గా రేవణ్ణ, నిందితుడు A2గా సతీష్‌బాబును చేర్చారు. బాధితుడి ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం 40కి పైగా చోట్ల దాడులు చేసింది. ఏ స్థలంలో మహిళను దాచారన్న దానిపై ఆరా తీస్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచి సిట్ బృందాలు మైసూరు, హాసన్, మాండ్యా జిల్లాలు, బెంగళూరు నగరంతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి.
ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని అధికారులు భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ చేశారు. కాగా, రేవణ్ణ ప్రస్తుతం బెంగళూరులోని ఓ అజ్ఞాత ప్రదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. తన లాయర్ ద్వారా ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, ఈరోజు సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని రేవణ్ణకు సిట్ రెండోసారి నోటీసులు జారీ చేసింది. రేవణ్ణకు ఈరోజు ముందస్తు బెయిల్ లభిస్తే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం