వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్‌బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు.
పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్‌బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు.
కొండమోడు సమీపంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ అధికారి కల్పశ్రీ, మరికొందరు అధికారులు వాహనాన్ని తనిఖీ చేయగా.. మద్యం సీసాలు కనిపించాయి. వాటిని వారు స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1.58 లక్షలు ఉంటుంది. వీటిని ఎన్నికల ప్రచారంలో భాగంగా పంపిణీకి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పిడుగురాళ్ల సెబ్ ఇన్స్పెక్టరు సూర్యనారాయణ తెలిపారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు