November 21, 2024
SGSTV NEWS
CrimeNational

ఇద్దరు కుమార్తెలతో తల్లి బలవన్మరణం

చెన్నై: భర్తతో అభిప్రాయ భేదాలు విడాకుల వరకు వెళ్లడంతో
తీవ్ర మనో వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో పాటు తానూ బలవన్మరణానికి పాల్పడింది. దిండుగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. దిండుగల్ జిల్లా తాడి కొంబు పరిధిలోని కామాక్షిపురం శక్తినగర్కు చెందిన శ్రీనివాసన్(42), మేనక (35) దంపతులకు హిందు మహావిని(16), తన్యశ్రీ(11) కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు స్థానికంగా సీబీఎస్ఈ పాఠశాలలో పది, ఆరు తరగతులు చదువుతున్నారు. మహావిని ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొద్ది రోజులుగా ఈ దంపతుల మధ్య జరిగిన గొ డవ విడాకుల కోసం కోర్టు వరకు వెళ్లింది.

నందవనం రోడ్డులో తాను నడుపుతున్న టూ వీలర్ సర్వీస్ సెంటర్ లో వాటర్ మోటార్ పనిచేయక పోవడంతో సోమవారం ఇంట్లో ఉన్న మోటారును తీసుకెళ్లేందు కు శ్రీనివాసన్ ప్రయత్నించాడు. దీనిని మేనకతో పాటు పిల్లలు అడ్డుకున్నారు. తమ గొడవలు విడా కుల కోసం కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో శ్రీనివా సన్ చర్యలపై మేనక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాయంత్రం అతడిని పోలీసులు పిలిపించి చీవాట్లు పెట్టారు. రాత్రి పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన శ్రీనివాసన్ ఇంట్లో ఉన్న తన బట్టలను తీసుకెళ్లేందుకు వెళ్లాడు.

ఇంటి తలుపులు తెరవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో కిటికి తలుపులు పగుల కొట్టి చూశారు. లోపల గది లో తన ఇద్దరు కుమార్తెలతో పాటుగా మేనక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టా నికి తరలించారు. శ్రీనివాసన్ను విచారించగా తాను పొద్దుపోయే వరకు పోలీసు స్టేషన్లోనే ఉన్న ట్లు చెప్పాడు. మనస్తాపంతో ఉన్న మేనక పిల్లలతో పాటు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పో లీసులు నిర్ధారించారు.

Also read

Related posts

Share via