April 19, 2025
SGSTV NEWS
CrimeViral

Viral Video: ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. బ్రిడ్జిపై యువకుడు మృతి

ఈ-రిక్షాను ఢీ కొని పడిపోయిన యువకుడి పేరు ఆకాశ్ సింగ్ (21) అని పోలీసులు గుర్తించారు


డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరిగి, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ బ్రిడ్జిపై తాజాగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి

ఓ యువకుడు వన్ వే రోడ్డులో బైకుపై వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ ఈ-రిక్షా డ్రైవర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. వెనకాల నుంచి వాహనాలు వస్తున్నాయన్న ధ్యాస కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ-రిక్షాను బైకర్ ఢీ కొని కింద పడిపోయాడు. దీంతో ఈ-రిక్షా డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.

ఈ-రిక్షాను ఢీ కొని పడిపోయిన యువకుడి పేరు ఆకాశ్ సింగ్ (21) అని పోలీసులు గుర్తించారు. ఆకాశ్ సింగ్ ను ఇతర ప్రయాణికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆకాశ్ సింగ్ తండ్రి అశ్వనీ సింగ్ ఫిర్యాదు మేరకు ఈ-రిక్షా డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆకాశ్ సింగ్ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవాడని అశ్వనీ సింగ్ చెప్పాడు.

Also read

Related posts

Share via