అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లాలో దుండగులు
దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
శనివారం ఉదయం నంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రచార రథంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. స్థానిక సీఐ పులిశేఖర్ తెదేపా శ్రేణులకు సర్ది చెప్పి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాదాపు 2 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





