కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్స్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు ముస్కాన్ మొహబ్బత్ షేక్ (5), సాజిద్ మహ్మద్ షేక్ (7)గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
ఇంటి ముందు పార్క్ చేసిన కార్లోకి ఆడుకుంటూ ఎక్కారు. ఎవరూ గుర్తించకపోడంతో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కారు లోపలి నుండి లాక్ చేయగా పిల్లలు దానిని అన్లాక్ చేయలేకపోయారని తెలిపారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు.. సాయంత్రం వరకు పిల్లలు ఇంట్లోకి రాకపోవడంతో వారికోసం వెతకడం ప్రారంభించారు. అనంతరం వారు ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా చేశారు.
అయితే.. కొన్ని గంటల తర్వాత, కారులో పిల్లలు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసిన ఓ వ్యక్తి.. వెంటనే కారు డోర్లు తెరిచి, పిల్లలను ఆసుపత్రికి తరలించారు. కానీ.. వైద్యులు అప్పటికే పిల్లలు చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రాథమికంగా.. పిల్లలు కారులోపల లాక్ చేయడంతో ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..