శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్ మిల్లులో మధ్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు.
పొదలకూరు, : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్ మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. 54 బాక్సుల్లో ఉన్న 2069 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4.05 లక్షలు ఉంటుందన్నారు. సెబ్ సీఐ వెంకట్రావు కేసు నమోదు చేసి మద్యం సీసాలను పొదలకూరు సెబ్ కార్యాలయానికి తరలించారు. రైస్ మిల్లు యజమాని సహాయకుడు పసుపులేటి పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మంత్రి కాకాణి అనుచరులు సర్వేపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల భారీగా మద్యం నిల్వ చేశారని అయిదు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025