బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్లు అనుసరిస్తున్న పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్‌గా నిలిచింది.
ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి.
మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్,తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు
Also read
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
- భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి.. పార్టీ ఇచ్చాడు!
- చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య