విశాఖపట్నం ఎన్ఏడి నుంచి గోపాలపట్నం మీదగా పెందుర్తికి ఓ కారు వెళుతోంది. గోపాలపట్నం జంక్షన్ కు వచ్చేసరికి.. కారులోంచి ఒక్కసారిగా మంటలు చెరేగాయి. తెరుకునేలోపే భారీ మంటలు కారంతా వ్యాపించాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికుల్లో మరింత ఆందోళన పెరిగింది. పెట్రోల్ బంకులో ఉన్న ఫైర్ ఎగ్జాస్టర్ తెచ్చి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నింంచారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఈలోగా కేవలం పదిహేను నిమిషాల్లోనే కారు పూర్తిగా కాలిపోయింది. దీంతో అటుగా వెళుతున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
గోపాలపట్నం బంకు మధ్య రోడ్డులో ఏపీ 31 టీవీ 6893 అనే నెంబర్ గల కారు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయింది. ముందుగా ప్రమాదాన్ని పసిగట్టిన కారు డ్రైవర్ గోపాలపట్నం పెట్రోల్ బంకు దగ్గర మధ్యలో ఆపి దిగిపోయారు. ఈ ప్రమాదంలో కారు నష్టం తప్ప ప్రాణ నష్టం కానీ ఎటువంటిదిది జరగలేదు. కారును మెకానిక్ షాపు దగ్గర నుంచి ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా డ్రైవర్ సాయికుమార్ పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం.. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో విషం!
- మహిళ ముందు ప్యాంటు జిప్ తీసి.. ప్రైవేట్ పార్ట్‌ను చూపిస్తూ.. ! అడ్డొచ్చిన సొంత తల్లిపై..
- ఒకే ఊరిలో ముగ్గురు మైనర్లకు పెళ్లి..! అధికారులు ఎంట్రీ ఇచ్చేసరికే..
- దుర్గగుడికి వెళ్లి వచ్చేసరికి ఊహించని షాక్.. కారులో పెట్టిన నగలు మాయం..
- ఇదేందయ్యా ఇది.. రోడ్డు ఇలా కూడా వేస్తారా.! అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్