హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతూ బీఎండబ్ల్యూ కారుని ఢీకొట్టాడు ఓ మైనర్(14). దీంతో కారు రిపైర్ చేయించడానికి రూ.20 వేలు ఇవ్వాలని ఇద్దరు డ్రైవర్లు డిమాండ్ చేశారు.
ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మైనర్ డ్రైవింగ్ కేసు పెడతామని బెదిరించారు. దీంతో ఆ బాలుడి కుటుంబంపై తీవ్ర ఒత్తిడి పడింది. డబ్బు లేదని, కొడుకు జైలుకు వెళ్తాడనే మనస్తాపంతో ఉరేసుకుని ఆ బాలుడి తల్లి సూర్య కుమారి (35) బలవన్మరణానికి పాల్పడింది.
ఆమె భర్త ఫిర్యాదుతో డైవర్లు చంద్ర శేఖర్, మహేశ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారు డామేజ్ అయితే యజమాని ఊరుకోడని, అందుకే డబ్బు ఇవ్వాలని కోరామని ఇద్దరు డ్రైవర్లు కన్నీటి పర్యంతమయ్యారు. తమ మీద కేసు పెడితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని అవేదన వ్యక్తం చేశారు.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!