తల్లిదండ్రులు విడిగా ఉండడం తట్టుకోలేని ఓ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
నల్గొండ : తల్లిదండ్రులు విడిగా ఉండడం తట్టుకోలేని ఓ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. నల్గొండ టూటౌన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు.. కుటుంబ తగాదాల కారణంగా తిప్పర్తి మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన పగిళ్ల సైదులు, అతడి భార్య సంధ్య గత రెండేళ్లుగా నల్గొండలోని సావర్కర్నగర్లో వేరువేరుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమార్తె యోగిత (22), కుమారుడు చాణక్య(20) సంతానం. యోగిత ప్రస్తుతం హైదరాబాద్లో పీజీ చదువుతోంది. ఇద్దరూ తల్లి పోషణలో ఉన్నారు. కొద్ది రోజులుగా తల్లిదండ్రులను కలపడానికి యోగిత పలు ప్రయత్నాలు చేసింది. కానీ.. వారు కలిసే పరిస్థితి లేదని మనోవేదన చెందిన ఆమె గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





