బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో టీడీపీ ప్రచార వాహన డ్రైవర్పై గురువారం ycp వర్గీయులు దాడికి పాల్పడ్డారు.
ఏల్చూరు (సంతమాగులూరు),: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో టీడీపీ ప్రచార వాహన డ్రైవర్పై గురువారం వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ప్రచారంలో భాగంగా తెదేపా వాహనం వైకాపా వర్గీయులు అధికంగా నివసించే చెరువు వీధిలోకి వెళ్లింది. అక్కడ ప్రచారం నిర్వహించవద్దని వాహన డ్రైవర్ను వైకాపా వర్గీయులు నిలువరించారు. ఈ నేపథ్యంలో వారికీ వాహన డ్రైవర్ సునీల్ కూ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైకాపా వర్గీయుల తోపులాటలో సునీల్ పక్కనే ఉన్న మురుగు కాల్వలో పడి గాయాల పాలయ్యారు. అయినప్పటికీ ఆగకుండా రాళ్లతో అతనిపై దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గుంపును చెదరగొట్టారు. సునీల్ను అక్కడి నుంచి పంపించేశారు. గ్రామంలో ప్రచారం చేస్తున్న తనపై అయిదుగురు వైకాపా మద్దతుదారులు దాడి చేసి, వాహనానికి జెండాలు కట్టే ఇనుప ఊచల్ని విరిచేసి, వైకాపా జెండాను తమ వాహనానికి కట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసు స్టేషన్లో సునీల్ ఫిర్యాదు చేశారు.. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..
- జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం





