బెంగుళూరుకు చెందిన భార్యాభర్తలు ఇద్దరు.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆ నాన్‌స్టాప్ బస్సు నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వైపు వేగంగా వెళ్తోంది. రొటీన్‌లో భాగంగా పోలీసులు కొన్ని పాయింట్లలో చెక్‌పోస్టులు పెట్టి.. చెకింగ్ చేస్తున్నారు. ఎన్నికలు కావడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో ఆ బస్సును కూడా ఆపారు. ఆ దంపతుల్లో టెన్షన్ మొదలైంది. వెరిఫై చేస్తే..! వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నం టూ విశాఖ నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు.. మరో అరగంటలో విశాఖ చేరుకోవాలి. ఎన్నికల నేపధ్యంలో అగనంపూడి టోల్ ప్లాజా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. బస్సును కూడా ఆపి సెర్చ్ చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో దంపతులిద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ప్రశ్నించగా.. వారి నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చాయి. వెరిఫై చేసేసరికి బ్యాగుల్లో గంజాయి ఒక్కసారిగా గుప్పుమంది. ఏడు ప్యాకెట్లలో పద్నాలుగు కిలోల గంజాయి బయటపడింది. గంజాయిని సీజ్ చేసిన అధికారులు.. భార్యాభర్తలు నాగరాజు, భారతిలను దువ్వాడలో అరెస్టు చేశారు. ఇద్దరు బెంగుళూరుకు చెందినవారిగా.. మన్యం నుంచి గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించి ఆరా తీస్తున్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025