గత కొన్ని రోజుల నుంచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది వైజాగ్. పొలిటికల్‌గా మాంచి కాక మీదున్న విశాఖ… భారీ డ్రగ్స్ కంటైనర్ ఛేజింగ్‌తో మరింత వేడెక్కింది. లేటెస్ట్‌గా రెండు గన్నులతో పాటు, మూడు బుల్లెట్లు దొరకడం… అదీ ఓ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి వీటిని విశాఖకు తీసుకురావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
వైజాగ్‌లోని శ్రీకృష్ణ ట్రావెల్స్ మేనేజర్ శివనాగరాజు అనే వ్యక్తి నుంచి రెండు తుపాకులు, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే శివనాగరాజును అరెస్ట్ చేసి ఆరా తీస్తే… షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఈ పిస్టల్స్ తనవి కాదని… జార్ఖండ్‌కు చెందిన వ్యక్తివిగా శివనాగరాజు చెప్పడం చర్చనీయాంశమైంది. కునాల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తూ బస్సులో వీటిని మరిచిపోతే తాను తీసుకున్నానని, ఈ తుపాకులకు తనకు ఎలాంటి సంబంధం లేదనడంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.
అసలీ కునాల్ శ్రీవాత్సవ ఎవరు..? ఏపీకి ఎందుకొచ్చాడు..? తుపాకీలు ఎందుకు తీసుకొచ్చాడు…? ఎవరికి ఇవ్వడానికి తెచ్చాడన్న… ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నారు విశాఖ పోలీసులు. జార్ఖండ్ వ్యక్తికి వైజాగ్ ఏం పని…? వైజాగ్ నుంచి బెంగళూరు ఎందుకెళ్లాడన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్షన్ టైమ్ కావడంతో ఈ తుపాకుల కేసుపై ఫుల్ ఫోకస్ పెట్టారు.
ఇదిలా ఉంటే మరోకేసులో 7వందల ఈ సిగరెట్లను వైజాగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 లక్షల విలువ చేసే ఈ సిగరెట్లను ముంబై నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఓ ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా… ఎన్నికల వేళ వరుస ఘటనలు వైజాగ్ పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే