సంగం: గడ్డి మందు తాగి ఓ వ్యక్తి మృత్యువాతపడిన ఘటన మండల కేంద్రమైన సంగంలో శుక్రవారం అర్ధరాత్రి జరగ్గా శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు సంగం వడ్డెరపాళేనికి చెందిన వి.మాల్యాద్రి (41) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నాలుగు రోజుల క్రితం నుంచి మాల్యాద్రి కనిపించలేదు. దీంతో కంగారుపడిన మాల్యాద్రి భార్య మంజుల సంగంతోపాటు పలుచోట్ల అతని కోసం వెతికారు. అయితే శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన మాల్యాద్రి తాను గడ్డి మందు తాగానని, వైద్యశాలకు తరలించాలని భార్యకు చెప్పాడు. వెంటనే ఆమె 108 వాహనంలో మాల్యాద్రిని నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించింది. మాల్యాద్రి అక్కడ చికిత్సపొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. దీంతో శనివారం వైద్యశాల అవుట్‌పోస్ట్ పోలీసుల సహకారంతో సంగం ఎస్సై నాగార్జునరెడ్డి మాల్యాద్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాల్యాద్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also read
- Annavaram: ఆలయంలో పెళ్లి.. పీటలపై ఏడుస్తూ కనిపించిన వధువు.. ఏంటా అని ఆరా తీయగా
- ఒంగోలులో TTD గోవుల అమ్మకం.. కమిషన్ల కోసం ఏం చేశారంటే.. టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు!
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!