కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 19:
వాంకిడి మండలం తేజపూర్ గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది వివరాల్లోకెళితే ఈ సందర్భంగా గ్రామ పటేల్ సెండే శంకర్, మాజీ ఎంపీటీసీ సోమేశ్వర్ గ్రామస్థులు మాట్లాడుతూ వాంకిడి మండలం తేజపూర్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు ఐనటువంటి మొహార్లే ధర్మయ్య గతరోజు 15/౦1/2024 న సంతోషంగా ప్రతి సంవత్సరం లాగా పుట్టపర్తి సాయి దర్శనానికి వెళ్తూ రైల్వేస్టేషన్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో దిగి కాచిగూడ ఎక్కంగ్గానే ప్రమాదవశాత్తు క్రింద పడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్న ఆయన మంగళవారం ఇక ప్రాణాలతో లేడని తెలిసిందని మరణించడం జరిగిందన్నారు మృతునికి భార్య మమత (22) ఇద్దరు చిన్న పిల్లలు పాప వర్శిత, బాబు ప్రవీణ్ ఆరు నెలలు, మూడు నెలల చిన్నపిల్లలు సంతానం ఉన్నారని నిరుపేద కుటుంబం అని కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబం ఇంటిపెద్ద లేని అనాధ అయిందని తెలిపారు.


బాధిత కుటుంబానికి తక్షణమే రైల్వేశాఖ గాని ప్రభుత్వం గాని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ వెంకటేష్, ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఆర్థికసాయం అందించాలని పేర్కొన్నారు విన్నవించారు.భార్య మమత భర్త లేడని ఇక రాడని మృతదేహం మీద పడి రోధించడం అందరినీ కలచివేసింది.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





