లక్నో, మార్చి 15: హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ షాకింగ్ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్ నుంచి ప్రసారం అయినట్లు పోలీసులు గుర్తించారు. తనకు స్వర్గంలో ఉన్నట్లు ఉందని, ఇక్కడి జీవితాన్ని ఆస్వాదిస్తున్నానంటూ రెండు నిమిషాల వీడియోలో నిందితుడు చెప్పడం విశేషం. హత్యా నేరం ఆరోపణలు ఎదుర్కొందున్న నిందితుడు జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో ప్రసారం చేసిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
2019 డిసెంబర్ 2న షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో రాకేష్ యాదవ్ (34) అనే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యుడీ) కాంట్రాక్టర్‌పై ఆపిఫ్ కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆసిఫ్‌తోపాటు మరో నిందితుడైన రాహుల్ చౌదరిలను ఈ హత్య కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. వీరు ప్రస్తుతం బరేలీ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో జైలులో ఉన్న ఆసిఫ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్‌లో మాట్లాడాడు. ‘నేను స్వర్గంలో ఉన్నాను. ఇక్కడి జీవితాన్ని ఆనందిస్తున్నా. త్వరలోనే బయటకు వస్తా..’ అని అందులో పేర్కొన్నాడు. డబ్బు శాశ్వతం కాదని, వ్యక్తి సంబంధాలకు విలువ ఇవ్వాలని అన్నాడు. ఎవరికైనా డబ్బు అవసరం ఉండే తనను అప్పు అడగొచ్చని కూడా ఈ వీడియోలో తెలిపాడు. రెండు నిమిషాల నిడివి కిలిగిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా గుప్పుమంది.
జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైలర్ కావడంతో హత్యకు గురైన రాకేష్ యాదవ్ సోదరుడు జిల్లా కలెక్టర్ ఉమేష్ ప్రతాప్ సింగ్‌ను గురువారం కలిసి, ఫిర్యాదు చేశాడు. నిబంధనలకు వ్యతిరేకంగా జైలులో ఉన్న నిందితులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని లేఖ ద్వారా ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో యూపీ జైళ్ల శాఖ డీఐజీ కుంతల్ కిషోర్ దర్యాప్తుకు ఆదేశించారు. ‘బరేలీ జైలు నుంచి వీడియో లైవ్ స్ట్రీమింగ్ అయిన ఘటనపై విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని’ మీడియాకు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం