April 19, 2025
SGSTV NEWS
Crime

శాస్త్రోక్తంగా శాంతి అభిషేకోత్సవాలు

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి అభిషేకాల క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అలంకారం మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు జరిపారు. అలంకార మండపం వద్ద ఆలయ అనువంశీక ప్రధానదీక్షా గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో సంకల్ప పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపారు. అలంకార మండపంలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కంద మూర్తి, శ్రీ వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, భక్త కన్నప్ప, చండికేశ్వరుడు, దక్షిణామూర్తి తదితర ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేపట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.

Also read

Related posts

Share via