విశాఖపట్నం: విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కొండపై నుంచి లోయలోకి బస్సు బోల్తా పడటంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పిఠాపురం నుంచి విద్యార్థులు పిక్నిక్ కోసం విశాఖపట్నానికి వచ్చారు. ఈ క్రమంలో కైలాసగిరిపైకి వెళ్లిన స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి లోయలోకి జారిపోయింది. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read
- హైదరాబాద్లో ఐటీ ఉద్యోగి అరెస్టు
- బెంగళూరులో 1,154 స్పా, మసాజ్ పార్లర్లపై తనిఖీ
- కాల భైరవ అష్టమి.. డిసెంబర్ 1న ఈ 5 ఆచారాలు పాటిస్తే భైరవుడి అనుగ్రహం లభిస్తుందట!
- కార్తీక సోమవారం వ్రత మహిమ.. కుక్కగా పుట్టిన మహిళకు కైలాస ప్రాప్తి ఎలా కలిగిందో తెలుసా?
- కార్తీక మాసంలో శివపార్వతుల శాంతి కళ్యాణం*
భద్రాచలం, నవంబరు 29:





