వాచ్ మాన్ పై దాడి, ఫర్నిచర్, ద్విచక్ర వాహనం ధ్వంసం
కోరుట్ల, : జగిత్యాల జిల్లా కోరుట్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు వీరంగం సృష్టించారు. వాచ్మ్యాన్పై దాడి చేయడంతోపాటు పాఠశాలలోని ఫర్నిచర్, ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బాబు పది రోజుల క్రితం బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో అశోత్రెడ్డి నియమితులయ్యారు. పలువురు విద్యార్థులు రాత్రివేళలో ఆరుబయట తిరగడంపై వాచ్మ్యాన్ తిరుమల్ ప్రిన్సిపల్ బాబుకు ఫిర్యాదు చేసేవారు. దాన్ని మనసులో పెట్టుకున్న పదో తరగతి విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి పాఠశాలలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. వామ్మ్యాన్ నిద్రిస్తున్న గది తలుపులు పగలగొట్టి తిరుమల్పై మూకుమ్మడిగా దాడి చేశారు.
పక్కగదిలో నిద్రిస్తున్న ఉపాధ్యాయుడు నరేందర్ వచ్చి అడ్డుకునే యత్నం చేయడంతో ఆయనకూ స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం విద్యార్థులు తిరుమల్ ద్విచక్ర వాహనాన్ని, పాఠశాలలోని ఫర్నిచర్, టీవీ, ఇతర సామగ్రి పూర్తిగా ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి నోడల్ అధికారి పూర్ణచందర్ పాఠశాలకు చేరుకుని వివరాలు ఆరా తీశారు.
విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై బాబురావు దాడి వివరాలు సేకరించారు. ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also read
- హైదరాబాద్ లొ దారుణం………! బధిరి మహిళపై అత్యాచారం…
- మైలవరం బస్టాండ్లో భారీ చోరీ.. ఐదుగురు మహిళల గుట్టు రట్టు!
- డాక్టర్ పద్మజకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
- గర్ల్స్ హాస్టల్లోకి పురుషులు.. లోపల బాగోతం వేరే!
- మాజీ ప్రియుడిపై కోపం.. షీ టీమ్స్ పేరుతో నకిలీ నోటీసు





