SGSTV NEWS online
Crime

వ్యాపార లావాదేవీల వివాదం.. పెళ్లి పేరుతో మహిళపై లైంగిక దాడి!


పంజాగుట్ట (హైదరాబాద్): వ్యాపార లావాదేవీల నేపథ్యంలో పరిచయమైన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేదించడంతోపాటు, ప్రైవేటు ఫొటోలు బయట పెడతానని బెదిరించినట్లు వచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబయిలోని మహిమ్ పోలీస్ ఠాణాలో 42 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను పరిధి ఆధారంగా హైదరాబాద్లోని పంజాగుట్ట ఠాణాకు బదిలీ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రై ఫ్రూట్స్, సుగంధద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్న బాధిత మహిళకు 2024 జులైలో వ్యాపార లావాదేవీల ద్వారా నిందితులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో వ్యాపార బకాయిల చెల్లింపుల విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నిందితుల్లో ఒకరు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని.. గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్ లొ హైదరాబాద్ వచ్చిన సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. బకాయిలు తిరిగి చెల్లించాలని అడిగినప్పుడల్లా తన వ్యక్తిగత ఫొటోలను బయట పెడతానని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

ఈ కేసులో వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్త చేస్తున్నారు. బ్యాంకు లావాదేవీల వివరాలు, వ్యాపార ఇన్వాయిస్లు, హోటల్ బస రికార్డులు, డిజిటల్ సంభాషణలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. బాధితురాలికి హైదరాబాద్ భరోసా కేంద్రం ద్వారా అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుల పాత్రను నిర్ధారించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు.

Also read

Related posts