కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య ఆచూకి దొరకపోవడంతో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇంట్లో నుంచి వెళ్లిన మూడ్రోజు తర్వాత భార్య ఫోన్ స్విఛ్చాఫ్ రావడంతో.. కంగారు పడిన భర్త.. ఎలాగైన తన భార్య ఆచూకీ కనిపెట్టాలని కోరుతున్నాడు.
కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య ఫోన్ మూడ్రోజుల తర్వాత స్విచ్చాఫ్ అవ్వడంతో పోలీసులను ఆశ్రయించాడు భర్త ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్, సాయిరాం కాలనీ, హనుమాన్ నగర్ కు చెందిన జిల్లెల్ల గోవర్ధన్ రెడ్డి (33), ప్రతిమ దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త రాపిడో డ్రైవర్గా పనిచేస్తుండగా.. భార్య హౌస్ కీపింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే వీరి మధ్య గత కొన్ని రోజులుల గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల ఐదో తేదీన భర్త తన వ్యక్తిగత పని నిమిత్తం కామారెడ్డి జిల్లాల్లోని స్వగ్రామమైన సింగాయిపల్లి వెళ్లి మరుసటి రోజు ఉదయం తిరిగి హైదరాబాద్లోని ఇంటికి వచ్చాడు. అయితే అతను ఇంటికి వచ్చిన సమయంలో భార్య ఇంట్లో కనిపించలేదు. దీంతో ఆమెకు ఫోన్ చేయగా, తాను మానసికంగా ఇబ్బందిగా ఉన్నానని, ఒక నెల తర్వాత ఇంటికి తిరిగి వస్తానని చెప్పిందని తెలిపాడు.
ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పాటు, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను కూడా బ్లాక్ చేసినట్లు తెలిపాడు. ఇక తానే వస్తుంది అనుకున్న భర్త.. మూడ్రోజులైన ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేశాడు.. అయితే ఒక్కసారి ఫోన్ రింగ్ ఆ తర్వాత స్విచ్ఛాఫ్ ఆయిపోయింది. దీంతో తనకు తెలిసిన వాళ్లు.. అతని బంధువులు వివిధ ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.
దీంతో స్ధానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు భర్త.. భర్త ఫిర్యాదుతో ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- ముగ్గురు పిల్లల తల్లిని అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపిన ప్రియుడు!
- మేడ్చల్ పీఎస్ పక్కనే భారీ చోరీ.. గోడకు కన్నం వేసి వెండి ఆభరణాల అపహరణ
- ఎన్నికల్లో గెలిచిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. టీడీపీ మహిళా నేత కన్నుమూత!
- Hyderabad: కుటుంబ కలహాలు .. భర్త ఊరెళ్లి తిరిగొచ్చేలోపే భార్య..
- వివాహేతర సంబంధం.. శృంగారంలో చేస్తుండగా ఇరుక్కుపోయిన ప్రైవేట్ పార్ట్.. ఆ భంగిమలోనే ఆస్పత్రికి తరలింపు





