SGSTV NEWS online
CrimeTelangana

ఫోన్‌లో మాట్లాడొద్దన్న భర్త.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య



హనుమకొండ జిల్లా: ఇంట్లో పనులు చేయకుండా ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నావని భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన భార్య ఉరేసుకుని ఆత్మహ్యతకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై కొంక అశోక్‌ కథనం ప్రకా రం.. బిహార్‌లోని నలంద జిల్లా మహత్వాన్‌ గ్రామానికి చెందిన గౌతమ్‌ పాశ్వాన్, రాధాకుమారి(20) దంపతులు సుమారు నాలుగేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మండల కేంద్రానికి వచ్చారు.

గౌతమ్‌ పాశ్వాన్‌ ప్రస్తుతం వివిధ యజమానుల వద్ద హమాలీ, కూలీ పనులకు వెళ్తున్నాడు. ఆదివారం సాయంత్రం గౌతమ్‌ పాశ్వాన్‌ కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రాధాకుమారి ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఇంట్లో పనులు చేయకుండా ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నావని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాధాకుమారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటనపై మృతురాలి భర్త గౌతమ్‌ పాశ్వాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Also read

Related posts