Hyderabad: హైదరాబాద్లో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాథమిక విచారణ ప్రకారం… కుటుంబ సభ్యులు కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కుటుంబపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. అయితే మరణానికి దారితీసిన కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కావాల్సి..
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జయభేరి నిర్వాణ అపార్ట్మెంట్స్ సీ బ్లాక్, ఏడో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 702లో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటన ఆదివారం ఉదయం 8.40 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. బతుల మారెడ్డి (65), ఆయన భార్య బతుల భారతి (60), కుమారుడు బతుల నిశాంత్రెడ్డి (38) గత ఏడాది కాలంగా సదరు ఫ్లాట్లో నివాసముంటున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ సభ్యులు కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు దారితీసిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also read
- గోకుల్ పార్క్ బీచ్లో విషాదం
- భర్త వివాహేతర సంబంధం తట్టుకోలేక..
- Hyderabad: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
- దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు జపిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందట!
- చ్ఛత్ పూజ 2026 – తేదీలు, ఆచారాలు, పూజ విధి, సామాగ్రి మరియు ధార్మిక ప్రాముఖ్యత





